

టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో సెప్టెంబర్ లేఆఫ్స్ ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎలాంటి హంగామా లేకుండా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు సమాచారం. కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే స్లాక్ ప్లాట్‌ఫామ్‌లో కొందరు కీలక ఉద్యోగుల ఖాతాలు కనిపించకుండా పోవడంతో లేఆఫ్స్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. మార్చిలో జరిగిన ఉద్యోగుల తొలగింపులతో పోలిస్తే ఈసారి ప్రక్రియ భిన్నంగా, నిశ్శబ్దంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంటూ సెప్టెంబర్ 4న రెడిట్‌లో ‘లే ఆఫ్స్ స్టార్టెడ్ ఇన్ యూఎస్’ పేరుతో ఓ థ్రెడ్ ప్రారంభమైనట్లు సమాచారం. ఒరాకిల్ అప్లికేషన్ ల్యాబ్స్ టీమ్‌లోని వైస్ ప్రెసిడెంట్లు, గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ల స్థాయి ఉద్యోగులపై ప్రభావం పడినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌లోనూ వివిధ విభాగాలకు చెందిన మేనేజర్లపై లేఆఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే తొలగింపుల సంఖ్య, ప్రభావిత విభాగాలపై ఒరాకిల్ నుంచి అధికారిక సమాచారం వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!