

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. దివంగత హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోకు సంబంధించిన ఏఐతో రూపొందించిన ఓ చిత్రాన్ని ఆయన ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ, అందులో ఉన్న తప్పును గుర్తించాలంటూ ప్రశ్నించారు. 1950ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రంలో మన్రో పాతకాలపు కార్ల మధ్య ఓ హోటల్ వెలుపల నిలబడి ఉన్నట్లు కనిపిస్తారు. అయితే, ఆ చిత్రంలో ఆమె ఎడమ చేతి మణికట్టుకు స్మార్ట్‌వాచ్ ఉండటాన్ని ఖ్వాజా ఆసిఫ్ గుర్తించారు.
ఆ కాలంలో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో లేవని పేర్కొంటూ, చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందులోని పొరపాటును గుర్తించాలని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అయితే, ఏఐతో రూపొందించిన చిత్రంలోని అంశాన్ని తప్పుగా గుర్తించారంటూ కాకుండా, అలాంటి చిత్రాన్ని నిజమైన పాత ఫొటోలా పరిగణించి వ్యాఖ్యానించడంపై నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు. దీంతో ఖ్వాజా ఆసిఫ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!