

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో అమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్‌కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి సొంతూరికి వచ్చాడు.
ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో ప్రేమ్‌కుమార్‌కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వాతావరణంలో జరగాల్సిన వేడుకల్లో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!