

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘన నివాళులర్పించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో పోలీసుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల ధైర్యసాహసాలు, సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
పోలీస్ అమరవీరుల కుటుంబాలు చేసిన త్యాగాలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సేవలను గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులందరికీ మరోసారి ఘన నివాళులర్పిస్తూ, వారి త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!