2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

Writer: Pooja 06:00 AM, 2 సెప్టెంబర్, 2026
తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పోలీస్‌ అధికారులతో ఫేమ్‌ ఇండియా, ఆసియా పోస్ట్‌ సంయుక్తంగా రూపొందించిన జాబితాలో తెలుగు ఐపీఎస్‌ అధికారులకు చోటు దక్కింది. ఒడిశాలోని ఝార్సుగూడ ఎస్పీ గుండాలరెడ్డి రాఘవేంద్ర టాప్‌ 25లో స్థానం సంపాదించారు. నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌, సామాజిక కార్యక్రమాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఈ గుర్తింపు లభించింది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 2019 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి రాఘవేంద్ర నక్సల్స్‌ ప్రభావిత నౌపడ ఎస్పీగా పనిచేసిన సమయంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని నక్సల్స్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ సేవలకు కేంద్ర హోం శాఖ నుంచి మెడల్‌ కూడా అందుకున్నారు.

ప్రస్తుతం ఝార్సుగూడ ఎస్పీగా పనిచేస్తున్న రాఘవేంద్ర పోలీసింగ్‌లో పలు సంస్కరణలు చేపడుతున్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల బాధ్యతను పెంచేందుకు ఆటోలు, ట్యాక్సీలను క్యూఆర్‌ కోడ్‌తో గుర్తించే స్మార్ట్‌ ఆటో ట్రాకింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. టాప్‌ 25 పోలీస్‌ అధికారుల జాబితాలో తనకు దక్కిన గుర్తింపును తోటి అధికారులు, సిబ్బందికి రాఘవేంద్ర అంకితం చేశారు. ఇదే సమయంలో సూపర్‌ 5 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ, సైబర్‌ క్రైం ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణాకు చోటు దక్కింది. దీంతో పోలీస్‌ శాఖలో ప్రతిభ కనబరుస్తున్న తెలుగు అధికారులకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

ట్యాగ్లు
టాప్ పోలీస్ అధికారులుతెలుగు ఐపీఎస్ అధికారులుగుండాలరెడ్డి రాఘవేంద్రపోలీస్ ప్రతిభఒడిశా పోలీస్ఏపీ సీఐడీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం
జనరల్

అన్నా హజారేను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!