
సినిమాలు

డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రోమనా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా రిజిస్టర్డ్ ప్రైవేట్ బిజినెస్ జెట్ ఒక్కసారిగా అదుపుతప్పి కూలిపోయింది. రన్‌వేపై దిగే ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి పక్కకు దూసుకెళ్లి క్షణాల్లోనే పేలిపోయింది. ఇంధన ట్యాంకులకు నిప్పు అంటుకోవడంతో పైలట్, కో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రసాయన ఫోమ్, నీటితో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించాయి. అయితే అప్పటికే విమానం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!