

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, జీవన వ్యయం విపరీతంగా అధికమవుతుండటంతో ఫ్రాన్స్‌లో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నట్లు సమాచారం. రాజధాని పారిస్‌లోనే లక్ష మందికి పైగా నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. రోజువారీ ఖర్చులు పెరిగిపోవడం, కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు పోలీసులపైకి బాటిళ్లు, కుర్చీలు విసిరినట్లు సమాచారం. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. పారిస్‌లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. జీవన వ్యయం పెరుగుదల ప్రజల్లో ఎంతటి అసంతృప్తిని కలిగిస్తోందో ఈ ఆందోళనలు మరోసారి స్పష్టం చేశాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!