

భారత నావికాదళం రాఫెల్-ఎం (మెరైన్) యుద్ధ విమానాన్ని గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నుంచి పరీక్షించింది. విమానం నౌకపై నుంచి ఎలా టేకాఫ్ అవుతుంది, తిరిగి ఎలా ల్యాండ్ అవుతుంది అనే అంశాలను అధికారులు పరిశీలించారు. విమానవాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం విమానాల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఈ పరీక్షలు కీలకంగా మారాయి. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. భారత నావికాదళం కోసం 26 రాఫెల్-ఎం విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఫ్రాన్స్‌తో సుమారు రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 22 సింగిల్ సీటర్ విమానాలు, నాలుగు ట్విన్ సీటర్ విమానాలు ఉన్నాయి.
రాఫెల్-ఎం యుద్ధ విమానాలు గంటకు అత్యధిక వేగంతో ప్రయాణించగలవు. ఇవి మ్యాక్ 1.8 గరిష్ఠ వేగాన్ని అందుకోగలవు. సుమారు 15.3 మీటర్ల పొడవు కలిగిన ఈ విమానాల్లో ఎం88 టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. గగనతలంలో శత్రు విమానాలను ఎదుర్కొనే క్షిపణులను ప్రయోగించడంతో పాటు, గాలిలోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం వీటి ప్రత్యేకత. ఒప్పందం ప్రకారం, ఫ్రాన్స్ ఈ విమానాలను 2028 చివరి నుంచి 2029 ప్రారంభం మధ్య భారత్‌కు అందించడం ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం విమానాల సరఫరా 2030లోపు పూర్తికావాల్సి ఉంది. ఇవి నావికాదళంలో చేరితే భారత సముద్ర రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!