
జనరల్

న్యూఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా అరెస్ట్ చేసిన సమయంలో రాహుల్ గాంధీకి గాయాలైనట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయన ముక్కుకు గాయం కావడంతో రక్తస్రావం జరిగిందని, కంటి కింద, చేతిపై కూడా గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీని పోలీసులు ఛత్రసాల్ స్టేడియానికి తరలించినట్లు పేర్కొన్నారు.
అరెస్ట్ అనంతరం వెంటనే వైద్యుడిని పిలవలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారిక వైద్యసాయం అందకముందే రాహుల్ గాంధీ వ్యక్తిగత భద్రతా సిబ్బందే ప్రాథమిక చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!