
జనరల్

ఆంధ్రప్రదేశ్లో నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి విస్తరించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ సహా 15 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!