17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Writer: Pooja 06:19 AM, 17 అక్టోబర్, 2026
అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఈ నెల చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఇతర వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 22 నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, 23వ తేదీ నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 25 లేదా 26వ తేదీ నాటికి అల్పపీడనంగా మారవచ్చని అంచనా. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడనాల్లో ఒకటి బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏది బలపడుతుందో వచ్చే వారం ప్రారంభంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

డిసెంబరు నాటికి మరింత వేడి వాతావరణం

భూమధ్యరేఖకు సమీపంలోని పశ్చిమ, మధ్య పసిఫిక్‌ సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, శక్తివంతమైన ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడంతో గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 86.25 మి.మీ., ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.69 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొక్కంటి, అన్నమయ్య జిల్లాలోని అమ్మచెరువు ప్రాంతాల్లో 66.05 మి.మీ. వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

భారీ వర్షం ఎఫెక్ట్...చెన్నైకి మళ్లిన తిరుపతి విమానం

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

ఆర్డీఎస్‌కు చేరని నీరు..ఆందోళనలో తెలంగాణ రైతులు

ట్యాగ్లు
వాతావరణంబంగాళాఖాతంఅరేబియా సముద్రంఅల్పపీడనంఈశాన్య రుతుపవనాలుఎల్‌నినో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
జనరల్

అహ్మదాబాద్‌–హైదరాబాద్‌ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా
జనరల్

ఏపీ ఎన్నికల వేళ వాట్సాప్‌ గ్రూపులపై నిఘా

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు
క్రీడలు

నేడే భారత్‌–వెస్టిండీస్‌ సిరీస్‌ నిర్ణయాత్మక పోరు

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

డెంగ్యూలో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో భారత సంస్థలకు సైబర్‌ ముప్పు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌
రాజకీయాలు

బొగ్గు కొనుగోళ్లలో కమీషన్ల కోసమే రేవంత్‌ ప్రయత్నం - కేటీఆర్‌

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ
జనరల్

పండుగ వేళ ప్రయాణ కష్టాలు..బస్టాండ్ల నుంచి హైవేల వరకు రద్దీ

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌
బిజినెస్

పోటీకి సిద్ధం..చట్టాల విషయంలో రాజీ లేదన్న రిలయన్స్‌

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!
జనరల్

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక!

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
జనరల్

అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ
జనరల్

గరుత్మంతుడిపై శ్రీవారి దివ్య దర్శనం...భక్తులకు కనుల పండుగ

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ
జనరల్

భారీ వర్షానికి నెమ్మదించిన తిరుమల గరుడ సేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!