
సినిమాలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేసింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం సహజీవనం (లైవ్-ఇన్ రిలేషన్‌షిప్)లో ఉండే జంటలు తమ సంబంధాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కల్పించే నిబంధనను కూడా బిల్లులో చేర్చారు.
అంతేకాకుండా, సహజీవనం ముగిసిన తర్వాత దానిని అధికారికంగా రద్దు చేసుకోవడం కూడా తప్పనిసరిగా ప్రతిపాదించారు. రిజిస్టర్డ్ సహజీవన జంటలకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లు నిర్వహించే రికార్డుల్లో నమోదు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో యూసీసీ అమలుపై విస్తృత చర్చకు దారితీసే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!