
సినిమాలు

తెలంగాణలో కొనసాగుతున్న తీవ్ర ఎండలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. జూలై 14న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అయితే జూలై 15 నుంచి వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుని పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ సూచనలు తెలిపుతున్నాయి.
జూలై 16 నుంచి 19 వరకు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!