
బిజినెస్

సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ మరింత సేవ చేయాలని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థించారు. రాజకీయ భేదాలకు అతీతంగా పరస్పర గౌరవాన్ని చాటే ఈ శుభాకాంక్షలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!