8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

Writer: Nithish 06:33 AM, 8 సెప్టెంబర్, 2026
ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్‌పై పర్వతారోహకులు, పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్ప్రింగర్‌ నేచర్‌ గ్రూప్‌ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 2023 నుంచి 2026 వరకు ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వద్ద వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిశీలించిన అధ్యయనం ప్రకారం.. ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి బేస్‌క్యాంప్‌ పరిసరాల్లోని హిమనీనదాల్లో సుమారు 70 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉంది. పర్వతారోహణ సీజన్‌లో దాదాపు 50 రోజుల పాటు బేస్‌క్యాంప్‌ వేలాది మంది పర్వతారోహకులు, సహాయకులతో కిక్కిరిసిపోతోంది. ఒక్క సీజన్‌లోనే అక్కడ సుమారు 1,600 టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.

బేస్‌క్యాంప్‌లో వంట, వేడి, రాత్రివేళల వెలుతురు కోసం భారీగా ఇంధనాన్ని వినియోగించడం కూడా మంచు కరగడానికి కారణమవుతోందని నివేదిక తెలిపింది. ఏటా సగటున 824 పోర్టబుల్‌ వంటగ్యాస్‌ సిలిండర్లు, 18,935 లీటర్ల కిరోసిన్‌, 5,130 లీటర్ల గ్యాసోలిన్‌ వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఈ కార్యకలాపాల వల్ల ఉత్పత్తయ్యే వేడి కారణంగా ఒక్క సీజన్‌లో సుమారు 2,492 టన్నుల మంచు కరిగిపోతున్నట్లు అంచనా వేసింది. మరోవైపు పర్వతారోహకులు, సహాయకులు రోజుకు దాదాపు 6,000 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తున్నారని, ఇది కుంభూ హిమనీనదంలోకి చేరుతోందని తెలిపింది. సరుకు రవాణాకు ఉపయోగించే యాక్‌లు, ఇతర జంతువుల సంఖ్య కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. వాటి మూత్రం వల్ల ఉత్పన్నమయ్యే వేడితో ఒక్క సీజన్‌లో మరో 154 టన్నుల మంచు కరిగిపోతున్నట్లు అధ్యయనం అంచనా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

ట్యాగ్లు
ఎవరెస్ట్‌ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌హిమనీనదాలుహిమనదుల కరుగుదలపర్వతారోహకులుపర్యావరణ కాలుష్యంవాతావరణ మార్పులుకుంభూ హిమనీనదంపర్వతారోహణపర్యావరణ ముప్పు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘సర్దార్ 2’పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సాంగ్స్

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..
క్రీడలు

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు
జనరల్

లండన్‌ నుంచి రాగానే యూట్యూబర్‌ రమా నందనకు నోటీసులు

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!
జనరల్

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!