
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో అమెరికా ఘర్షణ కూడా అతి త్వరలో పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ రెండు పరిణామాలకు సంబంధించి నిర్దిష్ట గడువులను వెల్లడించలేదు. అయోవాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రసంగించిన ట్రంప్.. ఇరాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. అవసరమైతే ఈ లక్ష్యం కోసం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో చమురు ధరలను పెంచేందుకు ఇరాన్ కుట్రలు పన్నుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో ఘర్షణ ఎప్పుడు ముగుస్తాయనే దానిపై ఆయన ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితినీ ప్రకటించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!