
సినిమాలు

ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని భద్రతా హెచ్చరిక నేపథ్యంలో జైపూర్కు మళ్లించారు. విమానంలో హైజాక్ జరిగిందనే వదంతి రావడంతో అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఈ క్రమంలో విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించగా, అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ హెచ్చరికకు సంబంధించిన పూర్తి వివరాలు, దాని వెనుక ఉన్న కారణాలపై అధికారికంగా మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!