

భాద్రపద మాసంలో వచ్చే సెప్టెంబర్ 2026లో పలు పర్వదినాలు, వ్రతాలు, పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 8న ప్రదోష వ్రతం, సెప్టెంబర్ 9న మాస శివరాత్రి, సెప్టెంబర్ 11న పోలాల అమావాస్య జరగనున్నాయి. సెప్టెంబర్ 14న వరసిద్ధి వినాయక వ్రతం నిర్వహిస్తారు. భక్తులు ఆయా పర్వదినాలను ఉపవాసాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలతో ఆచరించనున్నారు.
సెప్టెంబర్ 20న శ్రీ కేదారేశ్వర వ్రతం, సెప్టెంబర్ 22న పరివర్తినీ ఏకాదశి, వామన జయంతి ఉన్నాయి. సెప్టెంబర్ 25న గణపతి నిమజ్జనం, అనంతపద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26న పూర్ణిమ, ఉమామహేశ్వర వ్రతం జరగనుండగా, సెప్టెంబర్ 27న మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలను స్మరించుకునే ఈ కాలంలో కుటుంబ సంప్రదాయాల ప్రకారం పితృ తర్పణాలు, శ్రాద్ధకర్మలు, దానధర్మాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29న సంకటహర చతుర్థి తదితర పర్వదినాలు ఉన్నాయి. ఈ నెలలోని పండుగలు, వ్రతాలు భక్తులకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగించనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!