

సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి సుమారు 8.30 గంటలకు నోటీసులు అందించినట్లు సమాచారం. అక్టోబర్ 22, గురువారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 233కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన కేసుతో పాటు, సీజేపీ నిరసన సందర్భంగా జంతర్‌మంతర్ వద్దకు అనుమతి లేకుండా దూసుకెళ్లారనే ఆరోపణలపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరో సీజేపీ నేత అజింక్యా షిండే పాత్రపైనా పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.
నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో అక్టోబర్ 13న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని వారం రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచి తిహార్ జైలుకు తరలించారు. బుధవారం కోర్టు ఇద్దరికీ చెరో రూ.50,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మరో మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తదుపరి కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడింది. బెయిల్‌పై విడుదలైన వెంటనే పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!