
జనరల్

దాదాపు పది సంవత్సరాల క్రితం తండ్రి రాసుకున్న ఒక డైరీ ఇప్పుడు వేలాది మందిని ఆకట్టుకుంటోంది. అశుతోష్ ప్రతిహస్త్ తన తండ్రి డైరీని చదువుతూ తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అది ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వీడియోలో తండ్రి-కొడుకుల మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఆ డైరీలో తండ్రి తన జీవితంలోని చిన్న చిన్న సౌకర్యాలకే కృతజ్ఞత తెలియజేసిన విధానం అందరినీ ఆలోచింపజేస్తోంది. “ది సీక్రెట్” పుస్తకం చదివిన తర్వాత కృతజ్ఞత శక్తిని అర్థం చేసుకున్నానని ఆయన తెలిపారు. అప్పట్లో కోరుకున్న అనేక విషయాలు తరువాత నిజమయ్యాయని చెప్పారు. చివరగా ‘కృతజ్ఞతే జీవితం మార్చే శక్తి’ అనే సందేశం అందరినీ ప్రభావితం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!