

నీట్ ఉద్యమం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం వైరల్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన ఆయన, విజయం సాధించడం ఎంత ముఖ్యమో, దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” అనే ఆయన వ్యాఖ్య సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.
నెల రోజులకుపైగా సాగిన సీజేపీ ఉద్యమం అనంతరం నిర్వహించిన ఈ సంబరాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమస్యలు, ఆత్మహత్యల వంటి విషాదాల మధ్య ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించగా, యువత పోరాట సంస్కృతిలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, వలంటీర్లను గౌరవించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని, ఫైవ్ స్టార్ హోటల్లో సంబరాలు జరిగాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఈ వివాదం మధ్య వాంగ్చుక్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!