

అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సంస్థ రాత్రివేళ సూర్యకాంతిని భూమిపైకి పంపేందుకు ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతి ఇచ్చింది. “ఇయరెండిల్-1” అనే ఈ ఉపగ్రహం 60 అడుగుల భారీ అద్దాన్ని మోసుకెళ్లి రాత్రిపూట సూర్యకాంతిని భూమిపైకి పరావర్తనం చేస్తుంది. ఇది 640 కిలోమీటర్ల ఎత్తులో నుంచి సేవలు అందించనుంది. ఈ ఏడాది చివర్లో ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాత్రివేళ 5 కిలోమీటర్ల పరిధిలో కాంతిని అందించగలదు. దీని ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలకు ఎక్కువ సమయం సూర్యకాంతి లభించి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విపత్తుల సమయంలో అత్యవసర కాంతిని అందించడమే కాకుండా నిర్మాణ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కూడా ఉపయోగపడుతుంది. 2035 నాటికి 50,000కుపైగా ఉపగ్రహాలను ప్రయోగించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!