
జనరల్

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతవరకు వసతి సౌకర్యాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల దర్శనానికి సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా శ్రీశైలం వచ్చినప్పుడు మాత్రమే వారికి తగిన వసతి, దర్శన ఏర్పాట్లు కల్పిస్తామని ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతకాలం ఈ విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!