22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండుగ సాయన్నకు ఘన నివాళి.. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు ఏర్పాటు చేస్తాం: రేవంత్‌రెడ్డి

Writer: Shivani K 02:10 PM, 22 అక్టోబర్, 2026
పండుగ సాయన్నకు ఘన నివాళి.. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు ఏర్పాటు చేస్తాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో భూస్వాములు, జమిందార్లకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు అండగా నిలిచిన పండుగ సాయన్న ముదిరాజ్‌ అందరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సాయన్న పోరాటం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. దొరలు ఆక్రమించిన భూములను తన పోరాటంతో పేదలకు పంచిన గొప్ప వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. పండుగ సాయన్న జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌పై దొడ్డి కొమురయ్యతో పాటు పండుగ సాయన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చరిత్రలో సాయన్నకు తగిన గుర్తింపు లభించాలని, ఆయన పోరాటాన్ని ఇప్పటికీ జానపద గీతాల రూపంలో స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ముదిరాజ్‌ యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, ఆ వర్గానికి చెందిన నాయకులకు కూడా రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలన్న డిమాండ్‌ తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను కూడా చేపట్టామని గుర్తుచేశారు. గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలను మరింత విస్తరించామని, రాష్ట్రంలో 3.48 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంకితా భండారీ హత్య కేసు.. నార్కో పరీక్షల అంగీకారంపై ఉర్మిళా సనావర్‌కు కోర్టు సమన్లు

అంకితా భండారీ హత్య కేసు.. నార్కో పరీక్షల అంగీకారంపై ఉర్మిళా సనావర్‌కు కోర్టు సమన్లు

భారత్‌లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల కష్టాలు..

భారత్‌లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల కష్టాలు..

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు..ఇవే!

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు..ఇవే!

సౌదీ అరేబియాలో దమ్మామ్ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు

సౌదీ అరేబియాలో దమ్మామ్ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు

బద్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్

బద్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్

స్విట్జర్లాండ్‌లో వేగంగా కరుగుతున్న మంచు..

స్విట్జర్లాండ్‌లో వేగంగా కరుగుతున్న మంచు..

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డిపండుగ సాయన్నముదిరాజ్‌ సామాజికవర్గంతెలంగాణ ప్రభుత్వంట్యాంక్‌బండ్‌దొడ్డి కొమురయ్యకులగణనబీసీ వర్గాలుసంక్షేమ పథకాలుసన్నబియ్యం పంపిణీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయుధపూజలో ఏకే-47తో కాల్పులు.. వైరల్‌గా మారిన ‘లేడీ సింగం’ అంకితా శర్మ వీడియో
జనరల్

ఆయుధపూజలో ఏకే-47తో కాల్పులు.. వైరల్‌గా మారిన ‘లేడీ సింగం’ అంకితా శర్మ వీడియో

హీరోయిన్ కాయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్‌ను రూ.3 లక్షలకు అమ్మకానికి పెట్టారా?
సినిమాలు

హీరోయిన్ కాయదు లోహర్ తాగిన వాటర్ బాటిల్‌ను రూ.3 లక్షలకు అమ్మకానికి పెట్టారా?

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అస్వస్థత..
జనరల్

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అస్వస్థత..

అర్ధరాత్రి అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ కాల్‌.. బన్నీ రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

అర్ధరాత్రి అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ కాల్‌.. బన్నీ రియాక్షన్‌ వైరల్‌

30 ఏళ్ల వయసులో హిమానీ మిట్టల్ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

30 ఏళ్ల వయసులో హిమానీ మిట్టల్ స్ఫూర్తిదాయక ప్రయాణం

“హర్ గలీ మే జంతర్ మంతర్”.. అక్టోబర్ 23న ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు
జనరల్

“హర్ గలీ మే జంతర్ మంతర్”.. అక్టోబర్ 23న ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు

అంకితా భండారీ హత్య కేసు.. నార్కో పరీక్షల అంగీకారంపై ఉర్మిళా సనావర్‌కు కోర్టు సమన్లు
జనరల్

అంకితా భండారీ హత్య కేసు.. నార్కో పరీక్షల అంగీకారంపై ఉర్మిళా సనావర్‌కు కోర్టు సమన్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి
బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్...కొత్త ఛార్జీలు అమల్లోకి

భారత్‌లో ఫెరారీ కార్లకు పెరగనున్న డిమాండ్‌.. కొత్త షోరూమ్‌లు
బిజినెస్

భారత్‌లో ఫెరారీ కార్లకు పెరగనున్న డిమాండ్‌.. కొత్త షోరూమ్‌లు

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం
రాజకీయాలు

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం

భారత్‌లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల కష్టాలు..
జనరల్

భారత్‌లో డీప్‌టెక్ స్టార్టప్‌లకు నిధుల కష్టాలు..

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం
బిజినెస్

వీజెన్ బయో కార్-టీ చికిత్సకు న్యుసెలియాన్ సాంకేతిక సహకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!