

ఇరాన్‌లో కీలక నాయకులు లేకుండా పోయారని, ఎవరితో చర్చలు జరపాలో కూడా అర్థం కావడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకులను చంపడం ఆపాల్సి వస్తోందని, చర్చలు ఎవరితో జరపాలో తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో శనివారం జరిగిన ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ వద్ద విమానాలు, నౌకలు, నాయకులు మిగల్లేదు. ఆ దేశంలో ఉన్నత స్థాయి నాయకుడు, ఆ తర్వాతి స్థాయి నాయకుడు కూడా మరణించారు. వారిని చంపడం ఆపాలి. ఎందుకంటే మనం ఎవరితో చర్చలు జరపాలో తెలుసుకోవాలి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నాయకులు మరణించారు. మరణించిన వారిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా ఉన్నారు. ఆయన తర్వాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి
అమెరికా, ఇరాన్ మధ్య గత తొమ్మిది నెలలుగా వివిధ దశల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం దాడులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ, అమెరికా ప్రభుత్వం మరోసారి సైనిక చర్యలకు దిగవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలు మాత్రం ఇరాన్‌పై దాడులు ఆగొచ్చనే సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా అమెరికా హెచ్చరికలపై స్పందించారు. యుద్ధం మళ్లీ ప్రారంభమైనా, తమ దేశ విధానాల్లో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!