

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో సముద్రపు అలల ఉద్ధృతి ఓ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఏలూరుకు చెందిన కుటుంబ సభ్యులు అలల తాకిడికి సముద్రంలో చిక్కుకోగా, అక్కడ విధుల్లో ఉన్న జీవీఎంసీ స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో స్పందించిన వారు సాహసోపేతంగా సముద్రంలోకి వెళ్లి కుటుంబ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్పందించి కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర తీరాలకు వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రంలోకి దిగడం ప్రమాదకరమని, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యులతో బీచ్కు వచ్చే వారు భద్రతా సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!