

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించవద్దని ఆదేశించింది. వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులు, పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని సూచించింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన ప్రాంతాల్లో గడువు పొడిగింపుపై ఈ నెల 22లోగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
నామినేషన్ల గడువును పొడిగించాలని నిర్ణయిస్తే అభ్యర్థులకు కనీసం 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన ప్రాంతాల్లో కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించింది. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ నిఘా కల్పించాలని, అభ్యర్థుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!