17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్

Writer: Chandrika 06:15 PM, 17 అక్టోబర్, 2026
ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్

దేశ రాజధాని ఢిల్లీలోని హైకోర్టు సమీపంలో రహదారి భద్రత సమస్యల పరిష్కారంలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం.. మధుర రోడ్డులోని ఢిల్లీ హైకోర్టు సమీప కూడలి వద్ద పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేసింది. సరైన పాదచారుల క్రాసింగ్ సదుపాయాలు లేకపోవడం, ట్రాఫిక్ నిర్వహణలో లోపాలు ఉండటంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొంది. సమస్యలను గుర్తించి, క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక పరిష్కారాలను అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. కేవలం కమిటీల సమావేశాలకే పరిమితం కాకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కమిటీ ఈ సమస్యను పరిశీలిస్తోందని, ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని కోర్టుకు తెలిపారు. అయితే మరో ఉన్నతస్థాయి కమిటీ అవసరమేమిటని ప్రశ్నించిన ధర్మాసనం, సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించేందుకు అమికస్ క్యూరీ సహాయం తీసుకోవాలని సూచించింది. నవంబర్ 25లోపు అవసరమైన పనులను పూర్తి చేయాలని గడువు విధించింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అదనపు సొలిసిటర్ జనరల్‌తో పాటు ప్రధాన కార్యదర్శిని కూడా కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సరదాగా స్పందిస్తూ, నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద తామే ధర్నాకు కూర్చుంటామని, పని పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదలబోమని వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో పలు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ముందడుగు..

రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ముందడుగు..

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

ట్యాగ్లు
సుప్రీంకోర్టుఢిల్లీ హైకోర్టురహదారి భద్రతపాదచారుల భద్రతమధుర రోడ్డుట్రాఫిక్ నిర్వహణసుప్రీంకోర్టు వార్తలుఢిల్లీ వార్తలురహదారి భద్రత చర్యలునవంబర్ 25 గడువు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-వెస్టిండీస్ పోరుకు వర్షం బ్రేక్..
క్రీడలు

భారత్‌-వెస్టిండీస్ పోరుకు వర్షం బ్రేక్..

ఆఖరి టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర పోస్ట్..
క్రీడలు

ఆఖరి టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర పోస్ట్..

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల
రాజకీయాలు

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..
జనరల్

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ
జనరల్

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్
జనరల్

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
జనరల్

పులివెందులలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ముందడుగు..
జనరల్

రోడ్డు ప్రమాదాల నివారణలో తెలంగాణ ముందడుగు..

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు
జనరల్

గిన్నిస్‌ రికార్డు సాధించిన మూడేళ్ల బాలుడు

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
జనరల్

“తిరిగి రండి.. భారత్‌ను నిర్మిద్దాం”-జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు

అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...
సినిమాలు

అజయ్ దేవగణ్ బంగ్లాలో బీఎంసీ చర్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!