
క్రీడలు

కేంద్ర మంత్రి పదవికి సురేష్ గోపి రాజీనామా చేయబోతున్నారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవమని, కల్పిత కథలని స్పష్టం చేశారు.
సినిమా కెరీర్ కొనసాగించేందుకు ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నారన్న ప్రచారం, అలాగే వారసుల పేర్లు ప్రతిపాదించారన్న ఊహాగానాలను కూడా ఆయన తిరస్కరించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు.
ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన సురేష్ గోపి, ఈ రాజీనామా వార్త తనకే తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫేక్ న్యూస్ రాసేవారికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. దీంతో రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!