

కెన్యాలో కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నేపథ్యంలో టాటా కెమికల్స్ స్పందించింది. 2005 నుంచి కెన్యా ఆర్థికాభివృద్ధిలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కెన్యా ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది.
మైనింగ్, బ్లూ ఎకానమీ, మారిటైమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కోరిన సమాచారం, సంబంధిత పత్రాలను ఇప్పటికే సమర్పించినట్లు టాటా కెమికల్స్ వెల్లడించింది. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చామని, తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. కెన్యా ప్రభుత్వ అధికారాన్ని గౌరవిస్తామని, చట్టపరమైన మరియు నియంత్రణ మార్గాల్లో చర్చలు జరుపుతూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. తమ ఉద్యోగులు, మగాదీ కమ్యూనిటీ, భాగస్వాములు, అలాగే కెన్యా ఆర్థికాభివృద్ధి తమకు అత్యంత ముఖ్యమని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!