25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Chandrika 11:19 PM, 24 అక్టోబర్, 2026
ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెట్టుబడులకు భరోసా, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌, వేగవంతమైన అనుమతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానిక సంస్థలకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని  తెలిపారు. పారిశ్రామిక రంగానికి నమ్మకమైన విద్యుత్‌ సరఫరా, పటిష్టమైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకమైన ప్రభుత్వ విధానాలు కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రకటనలతోనే అభివృద్ధి పూర్తికాదని, వాటి ద్వారా ఉత్పత్తి పెరిగి, స్థానిక సంస్థలకు ఆర్డర్లు లభించి, కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అందినప్పుడే వాటి అసలైన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు.

‎

‎ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026లో భాగంగా హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఏరోస్పేస్‌ రంగంలో చిన్న పరికరం లేదా విడిభాగం వందలాది మంది ప్రాణాలకు భద్రత కల్పించగలదని భట్టి విక్రమార్క అన్నారు. ప్రయాణికులకు ఆ పరికరాన్ని తయారు చేసిన సంస్థ గురించి తెలియకపోయినా, దాని నాణ్యతపై ఉన్న నమ్మకమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా జీవితంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని, ప్రశంసలు, చప్పట్లు లభించకపోయినా బాధ్యతతో పనిచేసే వ్యవస్థల ద్వారానే విశ్వసనీయత ఏర్పడుతుందని వివరించారు.

ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో తెలంగాణ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ప్రభుత్వం కూడా అదే స్థాయి ఖచ్చితత్వం, క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమల్లో కొలతలు మైక్రాన్ల స్థాయిలో ఉంటాయని, ప్రభుత్వ అనుమతులు, చెల్లింపులు, విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో అనిశ్చితి నెలకొంటే నెలల తరబడి సాగిన ఉత్పత్తి ప్రయత్నాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు వేగంగా, విశ్వసనీయంగా అందాలని ఆకాంక్షించారు.

‎

‎

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

జర్మనీలో హిట్లర్‌ విడిది భవనం ‘ఈగిల్స్‌ నెస్ట్‌’లో అగ్నిప్రమాదం

జర్మనీలో హిట్లర్‌ విడిది భవనం ‘ఈగిల్స్‌ నెస్ట్‌’లో అగ్నిప్రమాదం

సీఎం విజయ్‌కు ఎయిర్‌ఇండియా కృతజ్ఞతలు
ట్యాగ్లు
ఎరోస్పేస్‌తెలంగాణపరిశ్రమలువిద్యుత్రక్షా ఎక్స్‌పోకర్టెన్‌ రైజర్‌ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సీఎం విజయ్‌కు ఎయిర్‌ఇండియా కృతజ్ఞతలు

జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ

జుహు కాల్పుల ఘటన తర్వాత వార్తల్లోకి టైగర్‌ ష్రాఫ్‌ ఆస్తి లావాదేవీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు
జనరల్

ఫ్రాన్స్‌లో దొంగసొత్తు ఆన్‌లైన్‌ అమ్మకాలపై కఠిన చర్యలు

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!
షోస్

బిగ్‌బాస్‌ 10లో 48వ రోజు.. ఒకరికి ప్రశంసలు, మరొకరికి చివాట్లు!

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్
జనరల్

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తీవ్ర నష్టం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రితేశ్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ
జనరల్

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు
ఆరోగ్యం

నోటిపూతతో బాధపడుతున్నారా..? మీకోసమే ఈ చిట్కాలు

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత
ఆరోగ్యం

పక్షవాత బాధితుడికి వెన్నుపాము మార్పిడి.. చైనా, రష్యా వైద్యుల ఘనత

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

ఎరోస్పేస్‌ రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

భారత రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి: సీఎం రేవంత్ రెడ్డి

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
సినిమాలు

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్
సినిమాలు

తమిళనాడులో 60 అడుగుల నయనతార కటౌట్

ఢిల్లీలో  అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.
జనరల్

ఢిల్లీలో అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర పథకాల నిధులను త్వరగా రాబట్టండి: తెలంగాణ సీఎస్‌ సంజయ్‌ జాజు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!