

తెలంగాణకు చెందిన ఓ మహిళ, సీనియర్ ఆర్మీ అధికారి భార్యపై గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం జమ్మూలో నివసిస్తున్న ఆమెపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం, చైనా నిఘా సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు విద్యావేత్తలు, పరిశోధకుల ముసుగులో ఆమెను సంప్రదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట పర్యావరణం, అంతర్జాతీయ సంబంధాలు, భౌగోళిక రాజకీయ అంశాలపై వ్యాసాలు రాయమని కోరిన వారు, క్రమంగా రక్షణ రంగం, సైనిక వ్యూహాలకు సంబంధించిన అంశాల వైపు ఆమెను మళ్లించినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో అధికారిక రహస్యాల చట్టం, 1923తో పాటు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
మరోవైపు, దేశ భద్రతకు సంబంధించిన రహస్య పత్రాలు, ఫొటోలు, ఎలక్ట్రానిక్ డేటాను ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్ల ద్వారా విదేశీ వ్యక్తులకు చేరవేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఏయే పత్రాలు సేకరించారు? ఎలాంటి సమాచారం బదిలీ అయింది? విదేశీ వ్యక్తులతో ఆమెకు ఉన్న సంబంధాల స్వరూపం ఏమిటి? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డిజిటల్ ఆధారాలు, అనుమానిత విదేశీ సంబంధాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో నిరూపితం కాలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!