
రాజకీయాలు

ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి అమూల్యమైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూ భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతున్నాయని తెలిపారు.
మహర్షి వాల్మీకి జీవితం, రచనలు భారతీయ సమాజంపై చెరగని ముద్ర వేశాయని గవర్నర్ కొనియాడారు. రామాయణం ద్వారా ధర్మం, నైతిక విలువలు, మానవతా సందేశాలను ప్రజలకు అందించిన ఆదికవి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహర్షికి గవర్నర్ నివాళులర్పిస్తూ, ఆయన సాహిత్య, ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్మరించుకున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!