23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు

Writer: Pooja 06:02 AM, 23 అక్టోబర్, 2026
పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు

తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన, ప్రతిపాదనల తయారీ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్), క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్ స్కీమ్ (సీఆర్‌జీఎస్‌ఎస్) మార్గదర్శకాలను అమలు చేయాలని పురపాలక శాఖ జీవో 952 జారీ చేసింది. ఈ పథకాల కింద ప్రతిపాదించే ప్రాజెక్టులకు సూత్రప్రాయ పరిపాలనా అనుమతులు ఇవ్వడానికి రెండు షరతులు విధించింది. రాష్ట్రస్థాయి హైపవర్ కమిటీ ప్రాజెక్టును ఆమోదించి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. అలాగే, ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఈ షరతులు నెరవేరిన తర్వాతే రాష్ట్ర మిషన్ డైరెక్టర్ అనుమతులు మంజూరు చేయవచ్చు. ప్రాజెక్టుల పరిశీలన కోసం రాష్ట్రస్థాయి సాంకేతిక, హైపవర్ కమిటీలను ఏర్పాటు చేయగా, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఈ పథకం కింద కేంద్రం మొత్తం రూ.లక్ష కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇందులో పట్టణ ప్రాజెక్టులకు రూ.90 వేల కోట్లు, ప్రాజెక్టుల రూపకల్పన, సామర్థ్య పెంపునకు రూ.5 వేల కోట్లు, క్రెడిట్ రీపేమెంట్ గ్యారెంటీ సబ్ స్కీమ్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించింది.

మరోవైపు, తెలంగాణలో సమగ్ర టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీని మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు పురపాలక శాఖ జీవో 950 జారీ చేసింది. 2020 నవంబర్ 3న జారీ చేసిన విధానాన్ని వర్తించే చట్టాలకు లోబడి కొనసాగించనున్నారు. అలాగే, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లకు ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నకిలీ దరఖాస్తులను అరికట్టడం, గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచడం ఈ నిర్ణయం లక్ష్యంగా పేర్కొంది. ఆధార్ లేని వారు పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేదా పురపాలక శాఖ అంగీకరించే ఇతర ఫొటో గుర్తింపు పత్రాలతో ధ్రువీకరణ పొందవచ్చు. ఈ చర్యల ద్వారా పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంతో పాటు, అనుమతుల ప్రక్రియలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఅర్బన్ చాలెంజ్ ఫండ్పట్టణాభివృద్ధిఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీటీడీఆర్ పోర్టల్ఆధార్ ధ్రువీకరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర
జనరల్

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
జనరల్

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్
బిజినెస్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క
జనరల్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం
జనరల్

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి
జనరల్

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన
జనరల్

మాంజా దారానికి మరో ప్రాణం బలి..కర్ణాటకలో విషాద ఘటన

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన
జనరల్

శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్‌పై సీసీఎంబీ కీలక పరిశోధన

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు
జనరల్

రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం కొత్త చర్యలు

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి - అధికారులకు పీసీబీ ఆదేశాలు
జనరల్

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి - అధికారులకు పీసీబీ ఆదేశాలు

పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు
జనరల్

పట్టణాభివృద్ధిపై తెలంగాణ కీలక నిర్ణయాలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నివేదిక
జనరల్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ నివేదిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!