

భారత సినిమా, రాజకీయాలు, క్రికెట్ కలయికలో ఒక ప్రత్యేక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి “దళపతి” విజయ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ ప్రత్యేక బహుమతిగా తన సంతకం చేసిన బ్యాట్‌ను అందించారు. ఎం.ఆర్.ఎఫ్ సంస్థ అధికారుల ద్వారా చెన్నైలో ఈ బ్యాట్‌ను విజయ్‌కు అందించినట్లు సమాచారం. సాంప్రదాయ దుస్తుల్లో విజయ్ సంతోషంగా బ్యాట్ స్వీకరిస్తున్న ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అవుతున్నాయి.
విజయ్‌కు క్రికెట్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ ఘటన మరింత ప్రత్యేకంగా మార్చింది. 2008 లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఐపీఎల్ సీజన్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఎంఎస్ ధోనీతో ఉన్న స్నేహం కూడా తెలిసిందే. ఇప్పుడు విరాట్ కోహ్లీ నుంచి వచ్చిన ఈ గిఫ్ట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. మరోవైపు కోహ్లీ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌పై దృష్టి పెట్టగా, ఈ నెల 26న ధర్మశాలలో గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ క్వాలిఫైయర్-1 ఆడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!