
జనరల్

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఆశీస్సులతో అని ముద్రించడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా పేరొందిన బండ్ల గణేష్ గతంలో చంద్రబాబు నాయుడిపై కూడా తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆగస్టు 16న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!