2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

Writer: Pooja 03:24 PM, 2 సెప్టెంబర్, 2026
జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

ఆధునిక ప్రపంచంలో జెన్ జీ (Gen Z) యువత ఉద్యోగ జీవితంపై తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. కార్పొరేట్ రంగంలో ఉన్నత పదవులు, ప్రమోషన్లు, భారీ జీతాలు సాధించడమే విజయంగా భావించే పాత ధోరణికి భిన్నంగా.. వ్యక్తిగత జీవితం, మానసిక ప్రశాంతత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యతకు వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎడ్యుకేషన్, అప్‌స్కిల్లింగ్ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ఎమెరిటస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దాదాపు 74 శాతం మంది జెన్ జీ ఉద్యోగులు లీడర్‌షిప్ హోదాల కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులు యువ ఉద్యోగులపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఒత్తిడిని పెంచుతున్నాయి. అధ్యయనం ప్రకారం సుమారు 60 శాతం మంది యువత నిరంతరం అప్‌స్కిల్ కావాలనే ఒత్తిడితో బర్న్‌అవుట్‌కు గురవుతున్నారు. అయితే, ఈ సవాలును ఎదుర్కొనేందుకు వారు సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తున్నారు. ఏకంగా 82 శాతం మంది జెన్ జీ ఉద్యోగులు ప్రతి వారం ఏఐ, జెనరేటివ్ ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తూ కొత్త నైపుణ్యాలను వేగంగా నేర్చుకుంటున్నారు.

జెన్ జీ ప్రాధాన్యతలు వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం కావడం లేదు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ కెరీర్స్ వైపు కూడా వారు ఆసక్తి చూపుతున్నారు. కేవలం జీతం, హోదాను కాకుండా మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో గుర్తింపు, పర్యావరణ స్పృహ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో పని, వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే కొత్త ఉద్యోగ సంస్కృతికి జెన్ జీ బాటలు వేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి  - నేపాల్ డిమాండ్

అమెరికా, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి - నేపాల్ డిమాండ్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

థాయ్‌లాండ్‌కు చేరిన ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’..

ట్యాగ్లు
జెన్ జీవర్క్ లైఫ్ బ్యాలెన్స్యువ ఉద్యోగులుఅప్‌స్కిల్లింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గ్రీన్ కెరీర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి
రాజకీయాలు

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్: మంత్రి పొంగులేటి

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం
క్రీడలు

డబ్ల్యూఆర్‌సీలో నవీన్‌ పులిగిళ్ల-మూసా షరీఫ్‌ జోడీకి మూడో స్థానం

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?
క్రీడలు

మెస్సీ తర్వాత అర్జెంటీనాకు కొత్త కెప్టెన్ ఎవరు?

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..
క్రీడలు

స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ యమాల్‌లా ఉన్న కేరళ కుర్రాడు..

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో లక్ష్య సేన్‌కు షాక్

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..
క్రీడలు

ఇమామ్‌ గాయంపై పాక్‌ సెలక్షన్‌ కమిటీ సీరియస్‌..

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై ఎర్రబెల్లి ఫైర్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్
జనరల్

టోల్‌ప్లాజాల వద్ద అక్రమాలపై ఈడీ నజర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!