

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లించనున్నారు. నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ వైపు పంపించనున్నారు.
ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్, మింట్ కాంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలను అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వద్ద వాహనాలను మింట్ కాంపౌండ్, రాజీవ్ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లించనున్నారు. ప్రయాణికులు తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్బుక్ పేజీ, ‘ఎక్స్’ ఖాతాను అనుసరించాలని అధికారులు సూచించారు. అత్యవసర ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించాలని కోరారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!