
జనరల్

పాకిస్థాన్లోని పెషావర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాల పైకప్పు కూలిపోవడంతో ఉపాధ్యాయుడితో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది 13 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతితో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
పైకప్పు కూలిన ఘటనలో పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు నిరంతరం చర్యలు చేపడుతున్నాయి. శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!