
సినిమాలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్జిట్ 2 సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందిన సమాచారం ప్రకారం, ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్‌లోని మొక్కలకు ట్యాంకర్‌తో నీళ్లు పడుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికుడిని, కోకాపేట నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ కార్మికుడు శ్రీనివాస్ (30), ఆటో డ్రైవర్ శ్రీనాథ్ (28) మృతి చెందారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!