
సినిమాలు

ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక దాడులు చేపట్టే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. టెహ్రాన్‌తో ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో మరోసారి పరిమిత స్థాయిలో ‘ఎపిక్ ఫ్యూరీ’ తరహా సైనిక చర్య జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ వారాంతంలో ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. తొలుత ఈ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. దాడుల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే, తాజాగా ఆయనే సైనిక చర్యపై సంకేతాలు ఇవ్వడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!