

భౌగోళిక ప్రాంతాలకు తన పేరు పెట్టాలనే ఆసక్తిని పలుమార్లు వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రానికి ‘ట్రంప్ ఓషన్’ అని పేరు పెట్టాలనే ఆలోచన ఆయనకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనను అమలు చేసేందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను సంప్రదించినట్లు ట్రంప్ స్వయంగా చెప్పినట్లు సమాచారం. మ్యాప్స్‌లో మహాసముద్రం పేరును మార్చే అంశంపై ఆయన పిచాయ్‌తో చర్చించినట్లు కథనం పేర్కొంటోంది.
అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనకు సుందర్ పిచాయ్ సానుకూలంగా స్పందించలేదని, దానిని సున్నితంగా తిరస్కరించడంతో ట్రంప్ ఆ ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. భౌగోళిక ప్రాంతాల పేర్ల మార్పు సాధారణంగా అధికారిక నిర్ణయాలు, సంబంధిత సంస్థల ప్రక్రియలతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్, పిచాయ్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఈ సంభాషణ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!