

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవను పురస్కరించుకుని భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ అధికారులు పరిశీలించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం గ్యాలరీల్లోని ఏర్పాట్లను తనిఖీ చేయగా, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మధ్యాహ్నం వేర్వేరుగా పరిశీలించారు. ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించడంతో పాటు పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు ఈవో వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, ఇతర టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!