
జనరల్

టీటీడీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి స్మార్ట్ గుర్తింపు కార్డులు జారీ చేయడానికి టీటీడీ ఈవో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. విధుల స్వభావాన్ని బట్టి వేర్వేరు రంగుల్లో, క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ముద్రించనున్నారు. ఈ కార్డుల ద్వారా సిబ్బంది వివరాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ కార్డు కలిగిన సిబ్బందికి నెలకు సబ్సిడీ ధరపై రూ.20కే 10 లడ్డూలు అందించనున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సిబ్బందికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!