

టైఫూన్ బావి (Typhoon Bavi) ప్రభావంతో చైనాలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా లియావోనింగ్ ప్రావిన్స్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రహదారులు జలమయమయ్యాయి. పరిస్థితులు విషమించడంతో సుమారు 2.60 లక్షల మందిని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
చైనా జాతీయ వాతావరణ కేంద్రం మంగళవారం కూడా భారీ వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరించింది. అప్రమత్తత చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 13 రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ శక్తివంతమైన టైఫూన్ విస్తీర్ణం ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానంగా ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఉత్తర కొరియా దేశాల్లో కూడా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!