26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

Writer: Chandrika 07:15 AM, 26 జులై, 2026
సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

వైద్య పరీక్షల కోసం సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చిన విచారణ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారవడం కలకలం రేపింది. సిద్దిపేట వన్‌టౌన్‌ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన జొన్నల సాయికుమార్‌ సిద్దిపేట, చిన్నకోడూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆటోలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జులై 15న అతడిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని సిద్దిపేట జిల్లా కారాగారానికి తరలించారు. శనివారం ఏఆర్‌ ఎస్సై ఒడ్డన్నతో పాటు తొమ్మిది మంది పోలీసు సిబ్బంది ఏడుగురు విచారణ ఖైదీలను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. నలుగురికి పరీక్షలు పూర్తికావడంతో వారిని తిరిగి పోలీసు వాహనంలో కూర్చోబెట్టగా, సాయికుమార్‌ను మరో ఖైదీతో కలిపి బేడీలు వేశారు.

మిగిలిన ఖైదీలకు వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో సాయికుమార్‌ తనతో బేడీలు వేసి ఉన్న సహఖైదీని బెదిరించి, బలవంతంగా చేతిని విడిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసు వాహనంలోని అత్యవసర ద్వారం నుంచి దూకి సమీపంలోని సందుల గుండా పరారయ్యాడు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తుండగా, పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఏఆర్‌ ఎస్సై ఒడ్డన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసుల పహారాలో ఉన్న ఖైదీ తప్పించుకోవడంతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
ట్యాగ్లు
సిద్దిపేటసిద్దిపేట పోలీసులుఖైదీ పరారీవిచారణ ఖైదీజొన్నల సాయికుమార్సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రితెలంగాణ క్రైమ్ వార్తలుపోలీసు కస్టడీసీసీటీవీ దృశ్యాలుపోలీసుల దర్యాప్తు
Advertisement

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

నీట్‌ ఉద్యమానికి కీలక విజయం.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..
జనరల్

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సినిమాలు

కారు కొనాలనే కోరికతో తొలి సినిమా చేశా: రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’
ఓటీటీ

ఓటీటీలో రాశి కొత్త చిత్రం ‘జాతిరత్నం’

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి
జనరల్

చెన్నైలో బ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

ఏపీకి కీలక రైల్వే కార్యాలయాలు.. రైల్వే బోర్డుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..
జనరల్

ఏపీ ఓటర్ల లెక్కల్లో షాకింగ్‌ నిజాలు..

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

కూరగాయల విక్రయం నుంచి కామన్వెల్త్‌ పతకం వరకు.. ఝండూ కుమార్‌ స్ఫూర్తిదాయక ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!