7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

Writer: Chandrika 09:39 PM, 7 సెప్టెంబర్, 2026
తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను యూపీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి దేశ ప్రజలందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను ఆయన అభినందించారు.

పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులను కూడా యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. సుమారు 1,000 సంవత్సరాల క్రితం జగద్గురు శ్రీ రామానుజాచార్య తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామితో పాటు శ్రీరాముల వారి దివ్యరూపాన్ని కూడా దర్శించుకోవడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగారు, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఏపీ మంత్రి నారాయణ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు కూడా హాజరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు..

ట్యాగ్లు
యోగి ఆదిత్యనాథ్తిరుమలశ్రీవేంకటేశ్వరస్వామిటీటీడీతిరుపతిఉత్తరప్రదేశ్ సీఎంతిరుమల ఆలయంఆలయ దర్శనంఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?
షోస్

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..
జనరల్

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
జనరల్

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా
టెక్నాలజీ

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..
జనరల్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!