
సినిమాలు

అమెరికాలో ఉపాధి రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఆగస్టు నెలలో ఆర్థిక నిపుణుల అంచనాలను మించి 1.62 లక్షల కొత్త ఉద్యోగాలు నమోదయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాజా ఉద్యోగ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని సూచిస్తున్నాయని పేర్కొన్న ఆయన, ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు ఫెడరల్ రిజర్వ్ వెంటనే వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు.
ప్రపంచంలోనే అత్యల్ప వడ్డీ రేట్లు అమెరికాలో ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్లు ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!