
సినిమాలు

అమెరికా మరోసారి ఇరాన్‌పై బాంబు దాడులు జరిపి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్‌తో పాటు డ్రోన్ లాంచ్ సైట్లు, ముఖ్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడానికి అమెరికా చేపడుతున్న ప్రయత్నాల భాగంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ప్రతీకార దాడులు చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికా రాడార్ వ్యవస్థలు, అమెరికన్ సిబ్బందే లక్ష్యంగా ఉన్నట్లు ఇరాన్ తెలిపింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!