
జనరల్

అమెరికా వీసా సమస్యలు, వలస విధానాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తెలుగు కుటుంబాలు అక్కడే వివాహాలు నిర్వహించే పరిస్థితి పెరుగుతోంది. విద్యార్థి వీసా లేదా హెచ్-1బీ కోసం ఎదురుచూస్తున్న యువత ఎక్కువగా అమెరికాలోనే పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్ల అద్దెలు, క్యాటరింగ్, పురోహితుల పారితోషికం, ఇతర వివాహ ఖర్చులు భారీగా పెరిగి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఎన్నారైలు చెబుతున్నారు.
డాలస్, షికాగో వంటి నగరాల్లో తెలుగు, భారతీయులు వివాహ సేవలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మరోవైపు వీసా రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ప్రత్యక్షంగా హాజరుకాలేక ఆన్లైన్లోనే వివాహ వేడుకలను వీక్షిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. సంప్రదాయ తెలుగు పెళ్లిళ్ల నిర్వహణ విధానాన్నే అమెరికా వీసా పరిమితులు మార్చేస్తున్నాయని ఎన్నారై కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!